హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్.. ఆగస్టు 10 లోపు అప్లై చేసుకోండి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ లో  ఇందిరమ్మ టవర్స్.. ఆగస్టు 10 లోపు అప్లై చేసుకోండి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పథకంపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.  ఆగస్టు చివరి వారంలో తొలి విడత గృహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

గ్రేటర్ పరిధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుండగా.. ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. నియోజకవర్గమే యూనిట్‌గా ఇళ్ల కేటాయింపు జరగనుండగా.. ఇందిరమ్మ టవర్స్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.

ఈ ఇళ్ల కోసం ఆసక్తి గలవారు ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పొంగులేటి. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని.. ఒక్కో ఫ్లాట్ విలువ సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని మంత్రి తెలిపారు.